రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ సెంటర్లు ఎక్కడంటే..
తెలంగాణ రాష్ట్రంలో (Telangana Elections 2023) పోలింగ్ ప్రక్రియ పరిసమాప్తమైంది. ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంల్లో (EVM) నిక్షిప్తం చేశారు. డిసెంబరు 3న (ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ (Counting Process) మొదలు కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లో ఓట్ల లెక్కింపు (Postal Ballot Counting) తర్వాత ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభించనున్నారు.
ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ సెంటర్లను (Election Counting centers) ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లోని పలు కార్యాలయాలు, విద్యాసంస్థల్లో లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో కౌంటింగ్ సెంటర్ల వివరాలు ఇలా ఉన్నాయి..Election Counting centers1. ఆసిఫాబాద్: నియోజకవర్గం: సిర్పూర్ ఓట్ల లెక్కింపు కేంద్రం: ఎస్సీ వెల్ఫేర్ గురుకుల కళాశాల, ఆసిఫాబాద్...