Lok Sabha Elections 2024: పోలింగ్ బూత్‌లోకి మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లొచ్చా? ఎన్నారైలకు ఓటు హక్కు ఉంటుందా?
Lok Sabha Elections : లోక్‌సభ మొదటి దశ ఎన్నికలు రేపు ప్రారంభం కానుండగా, ప్రజల నుంచి అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. పోలింగ్ బూత్‌లోకి తమ మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లవచ్చా లేదా అనేది చాలా మంది ఓటర్ల కు డౌట్ వస్తుంటుంది. ఒక ఫోన్ల గురించే కాకుండా పలు కీలకమైన ప్రశ్నలకు ఈ కథనంలో సమాధానాలను తెలుసుకోవచ్చు..
పోలింగ్ బూత్‌లలోకి మొబైల్ ఫోన్‌లను అనుమతిస్తారా?
ఎన్నికల ప్రక్రియలో న్యాయబద్ధత, సమగ్రతను కాపాడేందుకు ఎన్నికల సమయంలో ఓటర్లు తమ మొబైల్ ఫోన్‌లను పోలింగ్ స్టేషన్‌ల లోపలికి తీసుకెళ్లడానికి ఎలాంటి అనుమతి లేదు. ఎలక్ట్రానిక్ పరికరాలను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లడానికి వీలు లేదు. ఓటర్లు తమ ఓటును స్వేచ్ఛగా వేసే వాతావరణాన్ని సృష్టించేందుకు ఎన్నికల సంఘం అనేక నిబంధనలు రూపొందించింది.భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకారం, ఓటర్లు పోలింగ్ స్టేషన్‌లోకి మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడానికి అనుమతి లేదు. ...