హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అమ్మవారి విగ్రహం ధ్వంసం
Durga Devi Mandir attack | హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. దేవీ శరన్నవరాత్రోత్సవాల (Durga Devi) సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఉదయాన్నే స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి నిర్వాహకులకు సమాచారం అందించగా , నిర్వాహకులతోపాటు భక్తులు హిందూ సంఘాలుఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు చేరుకున్నాయి. స్థానికుల సమాచారంతో బేగంబజార్ పోలీసులు కూడా నాంపల్లి గ్రౌండ్స్‌కు చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్‌తోపాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.కాగా, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో దుండగులు.. మొదట అక్కడ కరెంట్ సరఫరా కట్ చేసి ఆ ప్రదేశంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ తరువాత దుర్గాదేవి అమ్మవారి విగ్రహం చేతిని వ...