DSC Recruitment 2024 | సెప్టెంబర్ నుంచి డీఎస్సీ నియామక ప్రక్రియ
DSC Recruitment 2024 | తెలంగాణలో సెప్టెంబర్ ఆఖరి వారం నుంచి ఉపాధ్యాయ నియామక ప్రక్రియను ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందు కోసం కసరత్తు కూడా మొదటుపెట్టింది. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేసింది. దీనిపై వచ్చే అభ్యంతరాలను పరిశీలించి ఈ నెలాఖరు వరకు తుది కీ విడుదల చేయనునుంది. మరోవైపు జిల్లాల వారీగా వివిధ కేటగిరీ పోస్టుల విభజన, డీఎస్సీ పరీక్ష రాసిన అభ్యర్థుల వివరాలు, రోస్టర్ విధానంపై విశ్లేషిస్తున్నారు. పరీక్ష ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించిన కారణంగా ఫలితాలను వేగంగా వెల్లడించే వీలుందని అధికారులు చెబుతున్నారు.రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఇటీవల పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 3,29,897 మంది దరఖాస్తు చేస్తే, 2,79,957 మంది పరీక్ష రాశారు. త్వరలో ఫైనల్ కీ విడుదల చేయనున్నారు. మరుసటి రోజు ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది.రోస్టర్ విధానం, జిల్లాల వారీగా పో...