ఐదేళ్ల బాలుడిపై కుక్కల గుంపు దాడి..
విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో శునకాలు రెచ్చిపోతున్నాయి. వరుస దాడులతో హడలెత్తిస్తున్నాయి. తాగా ఓ ఐదేళ్ల బాలుడు, అతడిని రక్షించేందుకు వెళ్లిన 45 ఏళ్ల వ్యక్తిపై వీధికుక్కల గుంపు దాడి చేసింది. ఈ సంఘటన పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని వేపగుంట సమీపంలోని పొర్లుపాలెం గ్రామంలో చోటుచేసుకుంది.స్థానికుల కథన ప్రకారం.. ఐదేళ్ల రిత్విక్ తన ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అతడిపై కుక్కల గుంపు దాడిచేయగా తలపై, వీపుపై గాయాలయ్యాయి. నాగరాజు అనే 45 ఏళ్ల వ్యక్తి బాలుడిని రక్షించేందుకు వెళ్లగా అతడిపై కూడా కుక్కలు దాడి చేశాయి. స్థానికులు గమనించి వెంటనే వారిని ఇద్దరినీ గోపాలపట్నం పీహెచ్‌సీలో చేర్చారు.ఇది కూడా చదవండి: ఒంటరి పోరాటంతో 7వేల కోట్ల రుణాలు తీర్చేసింది.. Cafe Coffee Day విజయగాథసంఘటన అనంతరం స్థానికులు మాట్లాడుతూ వేపగుంట వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రధాన రహదారి, మార్కెట్, పాఠశాలలు, దేవాలయాలు, ఆ...