Diwali 2024
Ayodhya Deepotsav 2024 | దేదీప్యమానంగా అయోధ్య .. 28 లక్షల దీపాలతో గిన్నిస్ రికార్డ్..
Ayodhya Deepotsav 2024 | దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని యూపీలోని టెంపుల్ సిటీ అయోధ్యలో ఏర్పాటు చేసిన భవ్య దిపోత్సవ్ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. భవ్య దిపోత్సవ్ వేడుకల సందర్భంగా అయోధ్య రామ మందిరంలో 28 లక్షల దీపాలను వెలిగించారు. సరయూ నది ఘాట్ లో 1,100 మంది భక్తిశ్రద్ధలతో హారతులు ఇచ్చారు. 28 లక్షల దివ్వెల వెలుగులతో భవ్య దిపోత్సవ్ గిన్సిస్ వరల్డ్ రికార్డ్ ను కైవసం చేసుకుంది. లక్షలాది మంది భక్తుల నడుమ […]
Deepavali 2024 Date | దీపావళి పండుగ తేదీ.. లక్ష్మీ పూజ ముహూర్త సమయాలు ఇవే..
Deepavali 2024 Date : వెలుగుల పండుగ దీపావళి సమీపిస్తోంది. పండగ నాడు ప్రతి ఇంటా.. దీపాల వెలుగులు, లక్ష్మీ పూజలు, వ్రతాలు, బాణసంచా మోతలతో దద్దరిల్లిపోతాయి. అయితే.. ఈ సంవత్సరం దీపావళిని ఏ రోజున జరుపుకోవాలనే దానిపై చాలా మందిలో గందరగోళం నెలకొంది. ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగ వస్తుంది. అలాగే దీనికి ముందు రోజు వచ్చే ఆశ్వయుజ బహుళ చతుర్థశిని నరక చతుర్థశి జరుపుకుంటారు. అయితే ఆ తిథి ఎప్పుడు వచ్చిందనే […]
Naraka Chaturdashi 2024 | నరక చతుర్దశి ప్రాముఖ్యత ఏమిటి? దేశంలో ఈ పండుగను ఎన్ని రకాలుగా జరుపుకుంటారో తెలుసా..
Naraka Chaturdashi 2024 | దీపావళి పండుగలో భాగంగా నరక చతుర్దశిని దేశంలోని ప్రతీ ప్రాంతంలో ఎంతో ఉత్సాహంతో భక్తితో జరుపుకుంటారు. నరక చతుర్దశి అంటే చెడుపై మంచి సాధించిన రోజు. అందుకే ఈ రోజున దేశమంతటా దీపాలు వెలిగిస్తారు. ఈ పండుగకు సంబంధించిన కొన్ని కథలు ఈ క్రింది విధంగా ఉన్నాయి: నరకాసురుని వధ: రాక్షస రాజైన నరకాసురుడు భూమిపై ప్రజలను హింసిస్తుంటాడు. అతడి హింసను భరించలేక, ప్రజలు సహాయం కోసం శ్రీకృష్ణుడిని, కాళికాదేవిని ప్రార్థించారు. […]
