Delhi Water crisis | తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్న ఢిల్లీ వాసులు
Delhi Water crisis | దేశ రాజధానిలో ఢిల్లీలో తాగునీటి కొరత ప్రజలను వేధిస్తోంది. గుక్కెడు నీటి కోసం అందరూ అల్లాడిపోతున్నారు. నీటి కొరత ఉన్న నేపథ్యంలో హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒక నెల పాటు అదనంగా నీటి సరఫరాను కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం కేంద్రం, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దేశ రాజధానిలో వేడిగాలుల పెరిగాయని, నీటి అవసరం కూడా గణనీయంగా పెరిగిందని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో తన పిటిషన్‌లో పేర్కొంది. మండుతున్న వేడిలో దేశ రాజధాని అవసరాలను తీర్చడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిటిషన్‌లో పేర్కొంది.హర్యానా అవసరమైనంత నీటిని విడుదల చేయడం లేదని ఢిల్లీ మంత్రి అతిషి కేంద్రానికి లేఖ కూడా రాశారు. "దిల్లీ తన రోజువారీ నీటి డిమాండ్ కోసం యమునా నది నీటిపై ఎక్కువగా ఆధారపడి ఉంది. అయితే, హర్యానా వజీరాబాద్ బ్యారేజీని విడుదల చేయకపోవడంతో గత కొన్ని రోజులుగా, వజీరాబాద్ బ్యారేజీ వద్ద నీటి మట్...