ఢిల్లీలో 12 అంతస్థుల్లో ఆర్‌ఎస్‌ఎస్ కొత్త ప్రధాన కార్యాలయానికి తొలగిన అడ్డంకులు
RSS Office | ఢిల్లీ అర్బన్ ఆర్ట్స్ కమీషన్ (DUAC) ఇటీవలే దేశ రాజధాని ఢిల్లలోని ఝండేవాలన్ ప్రాంతంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కొత్త కార్యాలయాన్ని పూర్తి చేయడానికి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) మంజూరు చేసింది. దీంతో కొత్త కార్యాలయం ప్రారంభోత్సవానికి మార్గం సుగమమైంది.ఆగస్టు 1న జరిగిన సమావేశంలో ఢిల్లీ అర్బన్ ఆర్ట్స్ కమిషన్ NOC కోసం ప్రతిపాదనను సమీక్షించింది. అయితే నిబందనల ప్రకారం అదనపు డాక్యుమెంటేషన్ లేని కారణంగా ఆమోదించలేదు. ఆగస్టు 29న విషయాన్ని పునఃపరిశీలించిన తర్వాత, టవర్లు 1, 2 పూర్తి చేయడానికి NOC మంజూరు చేసింది. ఈ తాజా పరిణామంతో త్వరలో భవనం పూర్తి చేసి ప్రారంభించడానికి అన్నిఅడ్డంకులు తొలగిపోయాయి.అధికారులకు సమర్పించిన డాక్యుమెంటేషన్, డ్రాయింగ్‌లు, ఫొటోల ఆధారంగా ప్రతిపాదనను సమీక్షించారు. దరఖాస్తు అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని తేలుస్తూ NOCని మంజూరు చేసింద...