Delhi Metro Pod hotel | ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో సకల సౌకర్యాలతో పాడ్ హోటల్స్..
Delhi Metro Pod hotel | ఢిల్లీ మెట్రో ప్రతిరోజూ తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు అనేక ట్రిప్పులలో బిజీగా ఉంటుంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని అనేక ప్రాంతాలలో విస్తరించి ఉన్న ఢిల్లీ మెట్రో ఇప్పుడు స్టేషన్లలో రాత్రిపూట బస చేయడానికి ఏర్పాట్లు చేసింది. DMRC న్యూఢిల్లీ స్టేషన్‌లో ఒక పాడ్ హోటల్‌ను ఏర్పాటు చేసింది, అక్కడ మీరు నిశ్చింతగా రాత్రిపూట విశ్రాంతి తీసుకోవచ్చు.ఢిల్లీ మెట్రో అనేది ఢిల్లీ వాసులకు జీవనాడి లాంటిది. ఢిల్లీ-ఎన్‌సిఆర్ లో లక్షలాది మందికి ఉదయం నుంచి రాత్రి వరకు మెట్రో రైళ్ల రాకపోకలతో నిత్యం కోలాహలంగా ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైనా మెట్రో స్టేషన్‌లోనే పడుకోవచ్చని అనుకున్నారా? మీరు ఖచ్చితంగా నిద్రపోవచ్చు, కానీ రాత్రిపూట మెట్రో సేవలు పూర్తయిన తర్వాత స్టేషన్ లో వెంటనే మీమ్మల్ని బయటకు పంపించేస్తారు. అయినప్పటికీ, మీరు మెట్రో స్టేషన్‌లో నిద్రపోవాలనుకుంటే, ఢిల్లీ మెట్రో మీ కోరికను నెరవేర్చింద...