
Arvind Kejriwal | కేజ్రీవాల్ లేఖపై బిజెపి కౌంటర్.. ఆర్ఎస్ఎస్ నుంచి ‘సేవా స్ఫూర్తి’ నేర్చుకోండి
New Delhi : ఆద్మీ పార్టీ (AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్‌కు రాసిన లేఖపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) విమర్శించింది, ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మీడియా దృష్టిని ఆకర్షించడానికి ఆయన ఈ లేఖను ఉపయోగించారని ఆరోపించింది. . కేజ్రీవాల్ (AAP chief Arvind Kejriwal) ఓటరు జాబితా తొలగింపులు చేస్తున్న బీజేపీని మీరు సమర్థిస్తున్నారా అని అంటూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు లేఖరాసిన విషయం తెలిసిందే.. దీనిపై తీవ్రంగా స్పందించిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది ఈ లేఖను ‘పబ్లిసిటీ స్టంట్’గా కొట్టిపారేశారు.సుదాన్షు త్రివేదీ కౌంటర్.."కేజ్రీవాల్ లేఖ మీడియా దృష్టిని ఆకర్షించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు." అని త్రివేది విలేకరుల సమావేశంలో అన్నారు. ఆరెస్సెస్ సంస్థకు రాయడానికి బదులు తన "రాజకీయ ఎత్తుగడలను" వదిలిపెట్టి.. ఆర్‌ఎస్‌ఎస్ నుంచి "సేవ...