dehradun
భారీ వర్షాలతో తెగిన రోడ్లు.. గర్భిణిని కొండలు దాటుకొని కుర్చీపై హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లిన గ్రామస్థులు
డెహ్రాడూన్: ఉత్తరఖండ్ లో భారీ వర్షాల(heavy rains) కారణంగా ఈ వారం చమోలిలో కొండచరియలు విరిగిపడడంతో రహదారులన్నీ తెగిపోయాయి. దేవల్ ప్రాంతంలోని బాన్ గ్రామంలోని స్థానికులు తమకు ఉన్న ఏకైక రహదారిని కోల్పోయారు. ఈ క్రమంలోనే 29 ఏళ్ల కిరణ్ దేవికి ప్రసవ నొప్పులు రావడం మొదలైంది. దీంతో కొంతమంది గ్రామస్థులు ఆమెను ప్లాస్టిక్ కుర్చీపై ఉంచి, తమ భుజాలపై పైకి లేపి, కనుమలు, కొండ ప్రాంతాల శిథిలాల మీదుగా కాలినడకన ఎంతో శ్రమించి చమోలి (Chamoli)లోని […]
