
Karnataka | కర్నాటకలో దారుణ ఘటన.. మొసళ్లతో నిండిన కాలువలోకి కన్న కొడుకును తోసేసిన తల్లి
Karnataka | కర్నాకటలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదంతో క్షణికావేశంలో ఓ మహిళ తన ఆరేళ్ల కుమారుడిని మొసళ్లతో నిండిన కాల్వలో తోసేసింది.. దీంతో ఆ బాలుడు ప్రాణాలు వదిలాడు. ఛిద్రమైన చిన్నారి మృతదేహం సరీసృపాల దవడల నుండి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దండేలి తాలూకాలోని హలమడి గ్రామంలో గత శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. బాలుడి మృతి కి కారణమైన సావిత్రి (32), ఆమె భర్త రవికుమార్ (36)పై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.Karnataka పోలీసుల వివరాల ప్రకారం.. సావిత్రి, రవికుమార్ దంపతుల కుమారుడు వినోద్ (6) పుట్టుకతోనే బదిరుడు. బాలుడికి మాటలు రావు. చెవులు విపించవు. బాలుడి వైకల్యంపై దంపతులు తరచూ గొడవ పడుతున్నారు. "శనివారం రాత్రి ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య వాగ్వాదం పెరగడంతో, సావిత్రి తన కొడుకును రాత్రి 9 గంటల సమయ...