IPL 2024 | టీ20 క్రికెట్ మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ మరో రికార్డ్..
IPL) 2024 | భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన అద్భుతమైన క్రికెట్ కెరీర్‌లో మరో మైలురాయిని సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో 12,000 పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా ఏస్ ఇండియన్ బ్యాట్స్‌మెన్ నిలిచాడు. శుక్రవారం MA చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 ప్రారంభ మ్యాచ్ లో కోహ్లీ ఈ అద్భుతమైన ఫీట్ సాధించాడు.
RCB తోపాటు, ఢిల్లీ కోసం T20, ఛాంపియన్స్ లీగ్‌లో, దేశవాళీ ట్వంటీ ఓవర్ క్రికెట్ మ్యాచ్ లలో కోహ్లీ 12000 పరుగులు సాధించాడు. దీంతో, టీ20 దిగ్గజాలు క్రిస్ గేల్, షోయబ్ మాలిక్, కీరన్ పొలార్డ్, అలెక్స్ హేల్స్, డేవిడ్ వార్నర్ తర్వాత ఈ రికార్డు సాధించిన ఆరుగురు ఆటగాళ్లలో కోహ్లీ కూడా ఉన్నాడు.
కాగా కోహ్లీ CSK vs RCB IPL మ్యాచ్‌లో ఏడో ఓవర్‌లో మైలురాయిని దాటాడు, రవీంద్ర జడేజా లెగ్ సైడ్‌లోని స్క్వేర్‌లోని ప...