Rythu Runa Mafi | రైతు రుణమాఫీకి నిబంధన.. రూ.2 లక్షలకు పైగా ఉన్న రుణాలకు కటాఫ్ డేట్..
Runa Mafi | రూ.2 లక్షలకుపైగా ఉన్న రైతు రుణాల మాఫీకి త్వరలోనే కటాఫ్ డేట్ ను వెల్లడిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రూ.2 లక్షలకుపైగా రుణం ఉన్న అర్హులైన రైతులు ముందుగా ఆపై ఉన్న రుణాన్ని చెల్లించిన తర్వాతే మాఫీ చేస్తామని ప్రభుత్వం ముందే ప్రకటించిందని గుర్తుచేశారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీకి రేషన్‌కార్డు ప్రామాణికం కాదని, తెల్ల రేషన్‌కార్డు ఆధారంగా రుణమాఫీ చేస్తున్నామనేదానిలో వాస్తవం లేదని స్పష్టంచేశారు.ఇప్పటివరకు రూ.18 వేల కోట్ల రుణాలను మాఫీ (Runa Mafi) చేసినట్లు మంత్రి పొంగులేటి చెప్పారు. రూ.12 వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉన్నదని రూ.2 లక్షలకు పైబడిన రుణమాఫీకి నెల, లేదా రెండు నెలల్లో కటాఫ్ తేదీ పెట్టి, రైతులు ఎక్కువ ఉన్న రుణాన్ని చెల్లించగానే రైతుల ఖాతాలో రూ.2 లక్షలు జమ చేస్తామని తెలిపారు. ఈ నిబంధనపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ...