Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Coronavirus Covid

Corona Cases | కరోనా టెర్రర్.. ఒక్కరోజే ఐదు మరణాలు
Andhrapradesh, Telangana

Corona Cases | కరోనా టెర్రర్.. ఒక్కరోజే ఐదు మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య (Corona Cases) రోజురోజుకు భారీగా పెరుగుతోంది.తాజాగా 800 కు చేరువలో కొత్త కేసులు నమోదయ్యాయి.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన గణంకాల ప్రకారం.. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల్లో 798 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి భారత్ లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,091కి చేరింది. ఇక గురువారం ఒక్కరోజే ఐదు గురు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో కేరళలో ఇద్దరు, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరిలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,33,351కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తికి జేఎన్‌.1 కొత్త వేరియంటే కారణమని తెలుస్తోంది.. తెలంగాణలోనూ కరోనా సమాచారంపై దాపరికం.. తెలంగాణలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా వ్యాపిప్తోంది ఇప్పటివరకూ గ్రేటర్ పరిధిలోనే ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప...