Corbevax Vaccine : హైదరాబాద్ కోర్బీవ్యాక్స్ టీకాకు డబ్ల్యూహెచ్‌వో అనుమతి
Corbevax Vaccine : హైదరాబాద్ నగరానికి చెందిన బయోలాజికల్ ఈ సంస్థ దేశీయంగా తయారు చేసిన కోర్బీవ్యాక్స్ కొవిడ్ టీకా (Corbevax Vaccine) కు ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రొటీన్ సబ్ యూనిట్ ఫ్లాట్ ఫాంపై స్వదేశీయంగా రూపొందించిన తొలి దేశీ కొవిడ్ వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం. కోర్బీవ్యాక్స్ టీకాను అత్యవసర వినియోగం కింద ఇవ్వవచ్చని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. కోర్బీవ్యాక్స్ కు ఇప్పటికే డీసీజీఐ అనుమతి లభించింది. ఇప్పటివరకు సుమారు 100 మిలియన్ల కోర్బీవ్యాక్స్ కొవిడ్ టీకాలను కేంద్ర ప్రభుత్వానికి బయోలాజికల్ ఈ సంస్థ అందించింది. ఈ టీకాను ఎక్కువగా 12 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లల కోసం వినియోగించారు.
కాగా తమ వ్యాక్సిన్ కు డబ్ల్యూహెచ్ ఎమర్జెన్సీ లిస్టింగ్ రావడం సంతోషకంగా ఉందని బీఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ ధాట్ల పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ వో లిస్టింగ్ తో తమ కంపెనీ కొవిడ్ 19 టీకాల ఉత్పత్త...