Saturday, August 30Thank you for visiting

Tag: Congress 6 Gurantees

CM Revanth Reddy : త్వరలోనే రూ.500లకు గ్యాస్ సిలిండర్.. ఇంద్రవెల్లి సభలో రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy : త్వరలోనే రూ.500లకు గ్యాస్ సిలిండర్.. ఇంద్రవెల్లి సభలో రేవంత్ కీలక వ్యాఖ్యలు

Telangana
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం మోగించింది. పార్లమెంట్ నియోజకవర్గాల పర్యటనలో భాగంగా ఇంద్రవెల్లి నుంచే మొదటి బ‌హిరంగ స‌భ‌ను రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు. అంత‌కు ముందు అక్కడ ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల ఆత్మీయ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాలకు రూ.60కోట్ల విలువైన బ్యాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేశారు. స్వయం సహాయక సంఘాలకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. స్కూళ్లు, హాస్టళ్ల విద్యార్థుల యూనిఫామ్ కుట్టుపని స్వయం సహాయక సంఘాలకే ఇచ్చేలా నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. మహిళలకు అండగా నిలిచేందుకే ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అడ్డుకోవాలని కొందరు కుట్ర చేస్తున్నారు. అలాంటి వారు ఊర్లలోకి వస్తే తగిన బుద్ధి చెప్పండని పిలుపునిచ్చారు. త్వ‌ర‌లోనే రూ.500ల‌కు గ్యాస్ సిలిం...