Coimbatore : తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులపై దాడి చేసిన ముగ్గురు నిందితులు, కాళ్లపై కాల్పులు
Coimbatore Rape Case | కోయంబత్తూరు : కోయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో కళాశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేసిన కేసు (Coimbatore Gang Rape Case)లో నిందితులైన ముగ్గురు వ్యక్తులను మంగళవారం తెల్లవారుజామున పోలీసులు కాల్పులు జరిపి వారిని అరెస్టు చేశారు. అధికారులపై దాడి చేసి తప్పించుకోవడానికి యత్నించిన నిందితులను తవాసి, కార్తీక్, కాళీశ్వరన్‌గా గుర్తించారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న 22 ఏళ్ల బాధితురాలు ఆదివారం తన స్నేహితుడితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ముగ్గురు వ్యక్తులు వాహనాన్ని అడ్డగించి దాడి చేశారు. నిందితులు ఆమెను కిడ్నాప్ చేసి, వేరే ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన తర్వాత, అనుమానితులను పట్టుకోవడానికి ఏడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.Coimbatore Rape Case : తమిళనాడ...



