
Mallikarjun Kharge | చిక్కుల్లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే..
Mallikarjun Kharge : ముడా స్కామ్‌లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీని ఇరుకునపెడుతుండగా మరో వివాదం అక్కడి హస్తం పార్టీకి కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతోంది. బెంగళూర్‌కు సమీపంలోని ఓ ఏరోస్పేస్ పార్క్‌లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుటుంబానికి చెందిన ఓ ట్రస్ట్‌కు ఏకంగా 5 ఎకరాల భూ కేటాయింపునకు ఆమోదం లభించడం దుమారం రేపుతున్నది. ఖర్గే కుమారుడు రాహుల్ ఈ ట్రస్ట్‌కు చైర్మన్‌గా ఉన్నారు. ఖర్గే కుటుంబానికి చెందిన ట్రస్ట్ కు కర్ణాటక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి బోర్డు (KIADB) భూ కేటాయించడం అధికార దుర్వినియోగమని, కర్ణాటక ప్రభుత్వం బంధుప్రీతికి సంకేతమని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వీయ ఎక్స్ వేదికగా ఆరోపణలు చేశారు.ఈ వివాదంపై మల్లికార్జున ఖర్గే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదు ఎకరాల భూమిని ఎస్సీ కోటా కింద సిద్ధా...