ప్రపంచంలో 3వ అత్యంత కాలుష్య దేశంగా భారత్.. టాప్ 50లో 42 భారతీయ నగరాలే.. నివేదికలో విస్తుగొలిపే వాస్తవాలు..
World Air Quality Report |ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశాలు, నగరాలపై చేపట్టిన సర్వేలో భారత్‌కు ఊహించని ఫలితాలు వచ్చాయి. స్విస్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ బాడీ IQAir విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2023లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ తర్వాత భారతదేశం మూడవ అత్యంత కాలుష్య దేశంగా ప్రకటించింది.
'వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023' ప్రకారం, ప్రతి క్యూబిక్ మీటరుతో పోలిస్తే.. , 2023లో బంగ్లాదేశ్ (క్యూబిక్ మీటర్‌కు 79.9 మైక్రోగ్రాములు), పాకిస్తాన్ ((క్యూబిక్ మీటరుకు 73.7 మైక్రోగ్రాములు) తర్వాత 134 దేశాలలో భారతదేశం (సగటు వార్షిక PM2.5 54.4 మైక్రోగ్రాములు )మూడవ అత్యంత తక్కువ గాలి నాణ్యతను కలిగి ఉంది. ఇక 2022లో, క్యూబిక్ మీటర్‌కు సగటున 53.3 మైక్రోగ్రాముల PM2.5 సాంద్రతతో భారతదేశం ఎనిమిదో అత్యంత కలుషితమైన దేశంగా ర్యాంక్ ను మూటగట్టుకుంది.
India air quality Rank : ప్రపంచంలోని టాప్ 50 అత్యంత కాలుష్...