Friday, August 1Thank you for visiting

Tag: Clay Ganesha

Clay Ganesha | హైదరాబాద్ లో మ‌ట్టి వినాయక విగ్రహాల పంపిణీకి సిద్ధం

Clay Ganesha | హైదరాబాద్ లో మ‌ట్టి వినాయక విగ్రహాల పంపిణీకి సిద్ధం

Telangana
హైదరాబాద్ : గణేష్ చతుర్థి సమీపిస్తున్న త‌రుణంలో హైదరాబాద్‌లో పండుగ సందడి తార స్థాయికి చేరుకుంది. చిన్న మట్టి విగ్రహాల ( Clay Ganesha) నుంచి.. భారీ విగ్ర‌హాల వ‌ర‌కు రోడ్ల‌పై క‌నువిందు చేస్తున్నాయి. వ‌ర్షం కురుస్తున్నా కూడా గణేశ విగ్రహాలను డ‌ప్పు చ‌ప్పుళ్ల మ‌ధ్య‌ ఊరేగింపుల‌తో మండ‌పాల వ‌ద్ద‌కు త‌ర‌లిస్తున్నారు. ఖైర‌తాబాద్ లో 70 అడుగుల భారీ విగ్ర‌హం.. Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో 70 ఏళ్ల పండుగ సంప్రదాయానికి గుర్తుగా 70 అడుగుల ఎత్తులో ఆకట్టుకునేలా చరిత్రలోనే అత్యంత ఎత్తైన వినాయక విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక‌ మార్కెట్లలో కూడా గ‌ణ‌ప‌తి విగ్ర‌మాల క్ర‌య విక్ర‌యాల‌తో సందడి నెల‌కొంది. అయితే పెరుగుతున్న పర్యావరణ అవగాహనకు ప్రతిస్పందనగా, అనేక మంది మట్టి, సహజ రంగులతో తయారు చేసిన చిన్న గణేష్ విగ్రహాలను కొనుగోలు చేస్తుండడం కనిపిస్తోంది. మట్టి విగ్రహాలు విక్రయించే స్టాళ్ల వ...