TTD Board : కాంట్రాక్ట్, సొసైటీ ఉద్యోగుల జీతాలు పెంపు, రూ.10కే భోజనం.. టీటీడీ కీలక నిర్ణయాలు
TTD Board Decisions : టీటీడీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 9 వేల మంది సొసైటీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచుతున్నట్లు టీటీడీ(TTD) ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి జగన్, టీటీడీపై విమర్శలు చేసిన రమణ దీక్షితులను ఉద్యోగం నుంచి తప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి (TTD Board Meeting) సమావేశం జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ కరుణాకరరెడ్డి విలేకరులకు వివరించారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఉద్యోగులకు రూ.10కే భోజనం
TTD Board Decisions | గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ విగ్రహాలకు బంగారు పూత, అలిపిరి, గాలి గోపురం, లక్ష్మీనరసింహస్వామి వద్ద ఉన్న నీటి బావులు ఆధునికీకరణకు అనుమతించారు. శ్రీలంకలో శ్రీవారి కల్యాణం నిర్వహించాలని పాలక మండలి తీర్మాన...