Char Dham Yatra schedule | భక్తుల కోసం తెరుచుకున్న చార్ ధామ్ యాత్ర, షెడ్యూల్ ఇదే..
Char Dham Yatra | ఉత్తరాఖండ్‌లోని చార్ ధామ్ యాత్ర హిందువులకు పవిత్రమైనంది. ఈ ఆధ్యాత్మిక యాత్ర కోసం అసంఖ్యాకమైన భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. యమునోత్రి (Yamumotri), గంగోత్రి (Gangotri), కేదార్‌నాథ్, బద్రీనాథ్ (Badrinath) పుణ్యక్షేత్రాలను తిలకించేందుకు దేశంలోని నలుమూలల నుంచి వస్తుంటారు. కాగా కేదార్‌నాథ్ (Kedarnath), గంగోత్రి యమునోత్రి ఆలయాలు శుక్రవారం భక్తుల కోసం తెరవబడ్డాయి. గర్హ్వాల్ హిమాలయాలలో నెలకొని ఉన్న ఈ ఆలయాలు ఏటా మంచు దుప్పట్లు కప్పివేస్తాయి. వేసవి రాకతో మాత్రమే తిరిగి తెరవబడతాయి.
Char Dham Yatra షెడ్యూల్ ..
Char Dham Yatra schedule : ఆలయ కమిటీ అధికారులు రీ ఓపెన్ షెడ్యూల్‌ను ప్రకటించారు. కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాలు ఉదయం 7 గంటలకు తెరవనుండగా, గంగోత్రి ఆలయం మధ్యాహ్నం 12:20 గంటలకు తెరుస్తారు. ఉత్తరాఖండ్ 'చర్ధమ్ యాత్ర'లో భాగమైన బద్రీనాథ్ మే 12వ తేదీన ఉదయం 6 గంటలకు తెర...