సికింద్రాబాద్ – నాగ్‌పూర్ వందే భారత్ టైమింగ్స్ మారాయ్..!
Secundrabad Nagpur Vande Bharat Timings | సికింద్రాబాద్ – నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయంలో స్వల్ప మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే చంద్రాపూర్ స్టాప్ సమయంలో మార్పులు చేసినట్లు తెలిపింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. రైలు సాయంత్రం 5.33 గంటలకు చంద్రాపూర్ రైల్వేస్టేషన్‌కు చేరుకొని 5.35 గంటలకు బయలుదేరాల్సి ఉండగా ఇక నుంచి ఈ రైలు 5.43 గంటలకు చేరుకొని.. 5.45 గంటలకు బయలుదేరుతుందని తెలిపింది. ఈ మార్పు అక్టోబరు 3వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది. మిగతా రైల్వేస్టేషన్ల సమయంలో ఎలాంటి మార్పులు లేవని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని కోరింది.కాగా, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ నాగ్‌పూర్- సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ రైలు 19 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వ...