Independence Day 2024 | జాతీయ జెండాను అత్యధిక సార్లు ఎగురవేసిన ప్రధాన మంత్రి ఎవరు? వివరాలు
Independence Day 2024 | భారతదేశపు అతిపెద్ద జాతీయ పండుగ - స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తోంది. పల్లెల నుంచి మహా నగరాల వరకు ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు, సంఘాలు, కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఆగస్ట్ 15 న జరగబోయే స్వతంత్ర దినోత్సవ సన్నాహాల్లో మునిగిపోయారు. దేశభక్తితో దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం మొదలైంది. తెల్లదొరల నుంచి దేశాన్ని రక్షించేందుకు స్వాతంత్ర్య దినోత్సవం సమరయోధులు, నాయకులు చేసిన అమూల్యమైన త్యాగాలను గుర్తుచేసుకునే సమయం ఇది.దేశవ్యాప్తంగా 'హర్ ఘర్ తిరంగ, 'తిరంగ యాత్ర' వంటి ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు 'హర్ ఘర్ తిరంగా' ప్రచారంతో అంతటా సందడిగా మారింది. జూలై 28న తన నెలవారీ 'మన్ కీ బాత్' రేడియో ప్రసారంలో, ప్రధాని మోదీ హర్ ఘర్ తిరంగా అభియాన్ గురించి మాట్లాడారు. harghart...