Thursday, January 2Thank you for visiting

Tag: cargo

TGSRTC Cargo Service | రాష్ట్ర ప్రజలకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఇక ఇంటి వద్దకే కార్గో సేవలు..

TGSRTC Cargo Service | రాష్ట్ర ప్రజలకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఇక ఇంటి వద్దకే కార్గో సేవలు..

Telangana
Hyderabad TGSRTC Cargo | ఇక నుంచి ఇంటి వ‌ద్ద‌కే నేరుగా కార్గో సేవ‌లను అందించేందుకు టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) సిద్ధమైంది. ఆర్టీసీ  ఆదాయాన్ని పెంచుకునేందుకు లాజిస్టిక్స్(కార్గో) సేవ‌ల‌ను  వేగంగా విస్త‌రించేందుకు  చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే రాజ‌ధాని హైద‌రాబాద్ లో  వేగ‌వంత‌మైన కార్గో సేవ‌ల‌ను అందించేందుకు హోం డెలివ‌రీ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్న‌ట్లు ర‌వాణా, బీసీ సంక్షేమ‌శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ వెల్ల‌డించారు. రేపటి నుంచే హైద‌రాబాద్ లోని 31 ప్రాంతాల నుంచి హోం డెలివ‌రీ సేవ‌లు అందుబాటులో ఉంటాయ‌ని మంత్రి పొన్నం వివ‌రించారు. టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంట‌ర్స్ నుంచి హైద‌రాబాద్ లో ఎక్క‌డికైనా హోం డెలివ‌రీ చేయవ‌చ్చ‌ని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంటి నుంచి ఇంటి వరకు సేవలు అందించేలా లాజిస్టిక్స్ విభాగాన్ని టీజీఎస్ఆర్టీసీ అభివృద్ధి చేస్తోంద‌ని తెలిపారు. ప్ర‌జ‌లంద‌రూ హోం డెలివ‌రీ స‌దుపాయా...