మీరు BSNL కి మారుతున్నారా? తక్కువ ధరకే 45 రోజుల రీఛార్జ్ ప్లాన్..
BSNL Rs 249 recharge plan | భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ప్రస్తుతం దూకుడుగా ముందుకు సాగుతోంది. ఇటీవల కాలంలో తీసుకువస్తున్న చవకైన ప్లాన్‌లతో Jio, Airtel, Vi వంటి పోటీదారులకు గట్టి షాక్ ఇస్తోంది. మిగతా ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఇప్పటికే ఉన్న రీఛార్జ్ ప్లాన్‌ల ధరను పెంచగా, BSNL మాత్రం తక్కువ ధర కలిగి ఎక్కువ వాలిడిటీని కలిగిన రీచార్జ్ ప్లాన్లను అందిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది. అయితే ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సర్వీస్ ప్రొవైడర్.. కొత్తగా 45-రోజుల వ్యాలిడిటీ గల ప్లాన్‌ను ప్రారంభించింది, ఇది దేశంలోని చాలా మంది వినియోగదారులకు ఉపశమనం అందిస్తుంది,. మిగతా కంపెనీల కంటే పోటీదారుల కంటే ఎక్కువ విలువను అందిస్తోంది.
ఈ కొత్త రీచార్జి వివరాలు..
Jio, Airtel మరియు Vi అధిక ధరలతో 28 లేదా 30-రోజుల చెల్లుబాటుతో రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. దీంతో BSNL సరసమైన 45-రోజుల చెల్లుబా...