Bsnl 5G Network | త్వరలో బిఎస్ఎన్ఎల్ 5G రోల్ ఔట్ .. ప్రకటించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య
Bsnl 5G Network | ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థకు సంబంధించి కొత్త అప్ డేట్ వచ్చింది. BSNL నుంచి 5G సర్వీస్ రోల్అవుట్ పై కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఒక కీలకమైన ప్రకటన చేశారు. ప్రస్తుతం, BSNL 4G నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి దేశవ్యాప్తంగా మొబైల్ టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. 75,000 కంటే ఎక్కువ కొత్త 4G టవర్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి. రాబోయే ఒకటి రెండు నెలల్లో, అదనంగా 100,000 4G టవర్లు ఏర్పాటు చేయనున్నారు.ఇది BSNL 5G సర్వీస్ ను ప్రారంభించడానికి లైన్ క్లియర్ అవుతుంది.జూన్ నెలలో Bsnl 5G Network ?BSNL కోసం ఉన్న అన్ని 100,000 4G సైట్‌లు మే నుంచి జూన్ 2025 నాటికి అందుబాటులోకి వస్తాయని మంత్రి సింధియా ధృవీకరించారు. దీని తర్వాత, 4G నుంచి 5Gకి మార్పు జూన్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) తన అధికారిక X హ్యాండిల్ ద్వారా ఈ అప్ డేట్ ను...