Watch | బొడ్డెమ్మ వేడుకల విశేషాలు ఇవే.. ఆటపాటలతో తొమ్మిది రోజులు సందడే సందడి..
Boddemma Vedukalu 2024 | తెలంగాణ రాష్ట్రం సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు. ఇక్కడి పండుగలన్నీ ప్రకృతితో ముడిపడి ఉంటాయి. అలాంటి పండుల్లో బతుకమ్మ, బొడ్డెమ్మ, బోనాలు, వినాయక చవితి పండుగలు ముఖ్యమైనవి. ఇందులో పల్లెల్లో కనిపించే బొడ్డెమ్మకు కూడా ఎంతో ప్రాశస్యం కలిగి ఉంది. బొడ్డె అంటే చిన్న అని అర్థం. బొడ్డెమ్మ అంటే చిన్న పిల్ల అనే అర్థంతో ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకొంటారు. బాలికలు మొదలుకొని మహిళలు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఇది కూడా మట్టి, పూలతో తెలంగాణ ఆటపాటలతో సంబంధం ఉన్న పండుగే. ఇప్పటికే తెలంగాణలో బొడ్డెమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇది కూడా బతుకమ్మ మాదిరిగానే తొమ్మిది రోజులు జరుపుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి వరకు పిల్లలు బొడ్డెమ్మను కొలుస్తూ గౌరీదేవిపై పాటలు పాడుతూ.. నృత్యాలు చేస్తుంటారు. తొమ్మిదవ రోజు బొడ్డెమ్మ ఆడిన తర్వాత బొడ్డెమ్మను దగ్గరలోని చెరువులు, కుంటల్లో ...