Tuesday, July 1Welcome to Vandebhaarath

Tag: bjp

Delhi elections : ఢిల్లీలో గెలిగేది బిజేపీనే తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్..!
Elections

Delhi elections : ఢిల్లీలో గెలిగేది బిజేపీనే తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్..!

Exit Polls 2025 | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ దాదాపు ఒకే విధమైన అంచ‌నాల‌ను వెల్ల‌డించాయి . ఢిల్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీపార్టీ, విపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేశాయి. ఈ ఎన్నిక‌ల్లో ఓటర్లు ఎవరికి ఎడ్జ్ ఇచ్చారన్న అంశంపైనా దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఒకే విధమైన అభిప్రాయాన్ని వ్య‌క్త‌ప‌రిచాయి.2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారతీయ జనతా పార్టీ (BJP) దేశ రాజధానిలో తిరిగి అధికారంలోకి రావచ్చని సూచిస్తున్నాయి. కొన్ని పోల్స్ పాలక ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)తో గట్టి పోటీ ఇస్తుంద‌ని వెల్ల‌డించాయి. అదే సమయంలో, కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కే ప‌రిమితంకావొచ్చని తేల్చి చెప్పాయి. 70 స్థానాల ఢిల్లీ అసెంబ్లీలో మెజారిటీ సాధించాలంటే ఒక పార్టీ 36 సీట్లు గెలుచుకోవాలి. కాంగ్రెస్ ఎన్నికల్లో గె...
Freebies Politics | పురుషులను వెంటాడుతున్న ఉచిత ప‌థ‌కాలు.. కొత్త ఛార్జీలతో జేబుల‌కు చిల్లు
National

Freebies Politics | పురుషులను వెంటాడుతున్న ఉచిత ప‌థ‌కాలు.. కొత్త ఛార్జీలతో జేబుల‌కు చిల్లు

Freebies Politics | గత కొన్ని సంవత్సరాలుగా ఉచిత ప‌థ‌కాలు రాజ‌కీయాల‌ను శాసిస్తున్నాయి. తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, ఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ ఇలా చాలా రాష్ట్రాల్లో ఎక్కువ‌గా ఉచిత ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయి. రాజకీయ పార్టీలకు ఎన్నికలలో విజయం సాధించడంలో ఇవే సహాయపడ్డాయి. ఉచిత కరెంటు, ఉచిత బస్సు ప్ర‌యాణం, మహిళలు , విద్యార్థులకు నెలవారీ ఆర్థిక సాయం.. ఇలా రాజకీయ పార్టీలు రాష్ట్ర ఖ‌జానాను ఆర్థిక ప‌రిస్థితుల‌ను ఏమీ ప‌ట్టించుకోకుండా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఒకదాని తర్వాత మరొకటి ఉచిత‌ పథకాలు ప్రవేశపెడుతూనే ఉన్నాయి.అయితే, ఈ ఉచిత‌ పథకాల భారం ఖజానాపై ( financial burden) పడుతుంది. దాదాపు అన్ని రాష్ట్రాలు ఇంత భారీ అదనపు ఆర్థిక భారాన్ని భరించడానికి సిద్ధంగా లేవు. ఇప్ప‌టికే తెలంగాణ‌, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తీవ్ర‌మైన‌ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి...
Annamalai | ‘అప్పటి వరకు చెప్పులు వేసుకోను.’: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై
National

Annamalai | ‘అప్పటి వరకు చెప్పులు వేసుకోను.’: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై

Annamalai | తమిళనాడు రాష్ట్రంలోని డీఎంకే (DMK) ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ తాను చెప్పులు వేసుకోబోన‌ని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నా యూనివర్సిటీ(Anna University)లో లైంగిక దాడి కేసులో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రతీ శుక్రవారం తన ఇంటి ముందు ఆరు కొరడా దెబ్బలు తింటానని గురువారం మీడియాకు వెల్ల‌డించారు. ఈ కేసులో బాధితురాలి పేరు, ఫోన్ నంబర్, వ్యక్తిగత వివరాలు వెల్లడించడంపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.ఎఫ్ఐఆర్ లీక్ చేయడం ద్వారా బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేశార‌ని, ఇది బాధితురాలి పట్ల ప్రభుత్వం, పోలీసుల వైఖరి ఎంటో తేట‌తెల్లం చేస్తుంద‌ని తెలిపారు . ఎఫ్ఐఆర్ వివ‌రాల‌ను లీక్ చేసినందుకు పోలీసులు, డీఎంకే పార్టీ నేత‌లు సిగ్గు పడాలి. నిర్భయ నిధి ఎక్కడ?. అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎందుకు సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయ‌లేదు’ అని అన్నామలై (Annamalai) ప్ర‌శ్న‌ల‌...
వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టిన  కేంద్రం.. త్వరలో JPCకి..
National

వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం.. త్వరలో JPCకి..

New Delhi | పార్లమెంట్‌లో తొలిసారిగా ఇ-ఓటింగ్ తర్వాత ఏకకాల ఎన్నికల(One Nation One Election Bill) కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభ (Lok Sabha)లో ప్రవేశపెట్టారు. ప్రవేశ తీర్మానం మెజారిటీతో ఆమోదించబడింది. తీర్మానానికి అనుకూలంగా 269 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 198 ఓట్లు పోలయ్యాయి. బిల్లు ఇప్పుడు జేపీసీకి పంపబడుతుంది.కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎల‌క్ష‌న్ - రాజ్యాంగ సవరణ బిల్లుతోపాటు ఒక సాధారణ బిల్లుల‌ను పెట్టారు. అయితే జ‌మిలి ఎన్నిక‌ల బిల్లు తీవ్ర చర్చకు దారితీసింది. బిల్లును వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. విపక్షాలు ఈ బిల్లును రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి విరుద్ధమని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మనీష్ తివారీ ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని అభివర్ణించారు. 7వ షెడ్యూల్‌కు మించిన ప్రాథమిక నిర్మాణాన్ని మార్చలేమని, ఈ బిల్...
Lk Advani | ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ
National

Lk Advani | ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ

LK Advani admitted to Apollo Hospital | బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ న్యూఢిల్లీ (New Delhi)లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య నిల‌క‌డ‌గా ఉందని ఆసుపత్రి అధికారులు ధృవీకరించారు. వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆయ‌న్ను అబ్జ‌ర్వేష‌న్ లోఉంచినట్లు పేర్కొన్నారు. 96 ఏళ్ల ఎల్‌కె అద్వానీ న్యూరాలజీ విభాగంలో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వినిత్ సూరి సంరక్షణలో ఉన్నారని వార్తా సంస్థ పిటిఐ తెలిపింది రెండు రోజుల క్రితం మాజీ ఉప ప్రధానిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. కాగాఈ ఏడాది మొద‌ట్లో కూడా అనారోగ్య కార‌ణాల వ‌ల్ల ఇదే ఆస్ప‌త్రిలో చేర్పించి చికిత్స అందించారు. కాగా ప్ర‌స్తుతం ఆయ‌న ఆసుపత్రి ()లో చేరడానికి కారణం ఇంకా వెల్లడి కాలేదు.(more…)...
Rajya Sabha bypolls : ఆంధ్రప్రదేశ్, హర్యానా, ఒడిశా అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
Elections

Rajya Sabha bypolls : ఆంధ్రప్రదేశ్, హర్యానా, ఒడిశా అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

Rajya Sabha bypolls : ఆంధ్రప్రదేశ్, హర్యానా, ఒడిశా అభ్యర్థులను ప్రకటించిన బీజేపీరాజ్యసభ ఉప ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బిజెపి) తమ అభ్యర్థుల జాబితాను సోమవారం విడుదల చేసింది. జాబితాలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, హర్యానా అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థుల పేర్లు ఇలా ఉన్నాయి.ఆంధ్ర ప్రదేశ్: ఆర్.కృష్ణయ్యఒడిశా: సుజీత్ కుమార్హర్యానా: రేఖా శర్మరాజ్యసభ ఉప ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్డిసెంబరు 20న ఎగువ సభకు ఎన్నికలు జరగనుండగా, అదే రోజు ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానా ఆరుగురు సభ్యులను రాజ్యసభకు ఎన్నుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, హర్యానాలో ఒక్కో సీటు ఖాళీ అయ్యాయి.కొత్త ఎంపీలు వచ్చే సీట్లు ఇవే..ఆంధ్రప్రదేశ్: రాష్ట్రం ముగ్గురు ఎంపీలను పంపనుంది. జగన్ మోహన్ రెడ్డికి చెందిన ముగ్గురు వైఎస్సార్‌సీపీ ఎంపీలు వ...
జార్జ్ సోరోస్ సంస్థతో  సోనియాగాంధీకి లింక్.. కాంగ్రెస్ పై బిజెపి ఫైర్..
National

జార్జ్ సోరోస్ సంస్థతో సోనియాగాంధీకి లింక్.. కాంగ్రెస్ పై బిజెపి ఫైర్..

Congress Party | జార్జ్ సోరోస్ (George Soros) ఫౌండేషన్ సంస్థతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సంబంధాలున్నాయంటూ భారతీయ జనతా పార్టీ (BJP) చేసిన ఆరోపణలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు (Kiren Rijiju) సోమవారం స్పందించారు. ఇలాంటి అంశాలను సీరియస్‌గా తీసుకోవాలని అన్నారు. దేశ రాజధానిలో ఆయ‌న విలేకరులతో మాట్లాడుతూ.. భారత వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, దాని కార్యకర్తలు ఐక్యంగా పోరాడాలని ఆయన కోరారు. "దేశం ముందున్న కొన్ని సమస్యలను రాజకీయ దృక్కోణంతో చూడకూడదని నేను భావిస్తున్నాను. జార్జ్ సోరోస్ .. వెలుగులోకి వ‌చ్చిన అతని లింకులు - మేము దీనిని కాంగ్రెస్ పార్టీకి లేదా రాహుల్ గాంధీకి సంబంధించిన సమస్యగా చూడము. ఇది భారత వ్యతిరేక శక్తులకు సంబంధించినదిగా గుర్తించాల‌ని అన్నారు.కాగా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) పై బిజెపి చేసిన ఆరోపణలు పె...
పార్లమెంట్‌లో  విపక్షాల్లో చీలికలు మొదలు..
National

పార్లమెంట్‌లో విపక్షాల్లో చీలికలు మొదలు..

Opposition Protests in Parliament : అదానీ కేసుకు సంబంధించి గురువారం పార్లమెంట్ కాంప్లెక్స్‌లో విపక్షాలు నిరసన తెలిపాయి. ఈ ప్రదర్శనలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ, ఇతర ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. అయితే ప్రతిపక్ష నేతలు నల్ల కోటు ధరించి నినాదాలు చేశారు. ఈ జాకెట్‌పై 'అదానీ, మోదీ ఒక్కటే' అని రాసి ఉంది. అదానీపై వచ్చిన ఆరోపణలపై ప్రధాని మోదీ దర్యాప్తు చేయబోరని కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్‌ పేర్కొన్నారు. అయితే పార్లమెంట్‌లో నిరసనల విషయంలో ప్రతిపక్షంలో కూడా చీలిక వచ్చింది. ఈ నిరసనకు మమ్మల్ని ఆహ్వానించలేదని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్ అన్నారు. అదానీ ఇష్యూ కంటే సంభాల్ ఇష్యూ పెద్దది. సంభాల్ విషయంలో ఎస్పీకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు. మోదీ-అదానీ ఒక్కటే: రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో ఎస్పీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ కూడా పాల్గొనలేదు. పా...
Maharashtra CM | మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ఎంపికపై ఏక్ నాథ్ కీలక ప్రకటన
Elections

Maharashtra CM | మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ఎంపికపై ఏక్ నాథ్ కీలక ప్రకటన

Maharashtra CM : ఎన్నికల ఫలితాలు వెలువడిన వారం రోజుల తర్వాత మహారాష్ట్ర సీఎం పీఠం ఎవరిదనే అంశంపై స్పష్టత వచ్చింది. 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ముఖ్యమంత్రి పదవిని దక్కించుకునేందుకు సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నిర్ణయాన్ని వాయిదా వేయడం ద్వారా షిండే ఎమోషనల్ మైండ్ గేమ్ ఆడినట్లు తెలుస్తోంది. తాను ప్రధానమంత్రి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, ప్రభుత్వ ఏర్పాటుకు "అడ్డంకి" కాబోనని ఏక్ నాథ్ షిండే ప్రకటించారు.కాగా మహారాష్ట్ర సీఎం ఎంపికలో ఏర్పడిన ప్రతిష్టంభనను పరిష్కరించే బాధ్యతను మోదీ.. అమిత్ షాకు అప్పగించారు. ముగ్గురు మహాయుతి నాయకులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేలతో  అమిత్ షా  సమావేశమయ్యారు. అయితే ఇక్కడ షిండే "సానుకూలంగా" ఉన్నప్పటికీ  ఆమర అసంతృప్తితో ఉన్నారని పలు వర్గాలు వెల్లడించాయి. తన బేరసారాల వ్యూహాలు విఫలమయ్యాయని గ్రహించిన షిండే, సిఎం, క్యాబినెట్ మ...
మ‌హా ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూప‌లేకపోయిన రాజ్‌థాక్రే, ప్రకాశ్ అంబేద్క‌ర్ పార్టీలు
Elections

మ‌హా ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూప‌లేకపోయిన రాజ్‌థాక్రే, ప్రకాశ్ అంబేద్క‌ర్ పార్టీలు

Maharashtra Assembly Elections : మహారాష్ట్ర ఎన్నిక‌ల్లో రాజ్ థాకరే కు చెందిన‌ మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీ (MNS), అంబేద్క‌ర్ మ‌న‌వ‌డు ప్రకాష్ అంబేద్కర్ కు చెందిన వంచిత్ బహుజన్ అఘాడి (VBA) ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. ఈ పార్టీలో మ‌హాయుతి సూనామీ ముందు కొట్టుకుపోయాయి. అయితే సమాజ్ వాదీ పార్టీ, ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ వంటి పార్టీలు కాస్త మెరుగైన స్థితిలో ఉన్నాయి. MNS 125 మంది అభ్యర్థులను నిలబెట్టగా, VBA 200 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. ముంబయిలోని మహిమ్‌ సీటులో పార్టీ అధినేత కుమారుడు అమిత్‌ థాకరే మూడో స్థానంలో నిలవడం ఎంఎన్‌ఎస్‌కు మింగుడు ప‌డ‌లేదు..19 మంది అభ్యర్థులను నిలబెట్టిన రాజు శెట్టి నేతృత్వంలోని స్వాభిమాని పక్ష (Swabhimani Paksha) కూడా ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ముఖ్యంగా పశ్చిమ మహారాష్ట్రలో రైతులపై ప్రభావం చూపుతున్నట్లు తెలిసింది. యాదృచ్ఛికంగా, ఓట్ల ల...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..