
Bihar Assembly | బీహార్‌లో కొలువుదీరిన మంత్రివర్గం.. మంత్రుల జాబితా ఇదే..
Bihar Assembly : బీహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో 10వ సారి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు, నితీష్ కుమార్ శుక్రవారం శాఖలను కేటాయించారు. ఇందులో భాగంగా నితిష్ కుమార్ జనరల్ అడ్మినిస్ట్రేషన్, క్యాబినెట్ సెక్రటేరియట్ విజిలెన్స్ విభాగాలను తన వద్ద ఉంచుకోగా, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి హోం శాఖను అప్పగించారు. ఉప ముఖ్యమంత్రి కూడా అయిన విజయ్ కుమార్ సిన్హాకు గనులు- భూగర్భ శాస్త్ర శాఖ, రెవెన్యూ, భూ సంస్కరణల శాఖను కేటాయించారు.మరోవైపు, బిజెపి బీహార్ యూనిట్ చీఫ్ దిలీప్ జైస్వాల్‌కు పరిశ్రమల మంత్రిగా, పార్టీ నాయకుడు మంగళ్ పాండేకు ఆరోగ్య, న్యాయ మంత్రిత్వ శాఖలు ఇచ్చారు. నితిన్ నబిన్ పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, రోడ్డు నిర్మాణ శాఖలను తన వద్దే ఉంచుకోగా, రామ్ కృపాల్ యాదవ్‌కు వ్యవసాయం దక్కింది. సంజయ్ సింగ్ టైగర్, నారాయణ్ ప్రసాద్‌లకు వరుసగా కార్మిక వనరులు, విపత్తు నిర్వహణ శాఖలు దక్కాయి.జనతాదళ...

