
BJP | ఒకేసారి 16 మంది మంత్రుల రాజీనామా.. గుజరాత్‌లో ఏం జరుగుతోంది..
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బిజెపి వ్యూహంGandhinagar : గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మంత్రివర్గంలోని 16 మంది మంత్రులు రాజీనామా చేయడం సంచలనం రేపింది. బిజెపి (BJP)కి బలమైన కోట అయిన గుజరాత్‌లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని చాలా కాలంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. కానీ గురువారం జరిగిన కీలక పరిణామంలో, భూపేంద్ర పటేల్ తప్ప మిగతా మంత్రులు రాజీనామా చేయడం హాట్ టాపిక్‌గా మారింది. 2021లో కూడా ఇదే తరహాలో గుజరాత్‌లోని బిజెపి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులందరినీ ఒకేసారి తొలగించింది. ఇప్పుడు, తదుపరి రాష్ట్ర ఎన్నికలకు రెండేళ్లు మిగిలి ఉండగా, బిజెపి అందరు మంత్రులను రాజీనామా చేయించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ బృందంలో కొత్తవారికి చాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొత్త బృందంలో అన్ని కొత్త మంత్రులు ఉంటారా లేదా కొందరు పునరావృతమవుతారా అనేది చూడాలి....
