Bengaluru water crisis | బెంగళూరుతో ముదురుతున్న నీటి సంక్షోభం.. ప్రభుత్వం కీలక నిర్ణయం
Bengaluru water crisis | కావేరి నదిలో నీటి మట్టాలు తగ్గుముఖం పట్టడంతో బెంగళూరు వాటర్ సప్లై, సీవేజ్ బోర్డు (BWSSB) కఠినమైన చర్యలు తీసకోవాలని భావిస్తోంది. కొన్ని రోజులుగా సిలికాన్ సిటీ బెంగళూరు తీవ్ర నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న విషయం తెలిసిందే.. మే నెల ప్రారంభమవుతున్న నేపథ్యంలో బెంగళూరులో రక్షిత తాగునీటి లభ్యతపై ఆందోళనలు పెల్లుబికుతున్నాయి. ప్రధాన నీటి వనరుగా కావేరి నదిపై ఎక్కువగా ఆధారపడుతోంది బెంగళూరు నగరం అయితే కావేరి జలాలు తగ్గుముఖం పట్టడంతో నీటి కొరత విపత్తును ఎదుర్కొంటోంది.ప్రస్తుతం, కావేరి జలాశయంలో కేవలం 11 వేల మిలియన్ క్యూబిక్ (TMC) అడుగుల నీరు ఉంది. 5 TMC డెడ్ స్టోరేజీగా నిర్ణయించబడింది. దీనివల్ల 6 టీఎంసీల నీరు ఉపయోగపడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుంటే, బెంగళూరు అవసరాలను తీర్చడానికి నెలకు సుమారుగా 1.8 TMC నీరు అవసరం. బెంగళూరులో నీటి పంపిణీకి బాధ్యత వహించే ఏజె...