Saturday, August 30Thank you for visiting

Tag: BC Reservations

హిందువులను మైనారిటీలుగా మార్చాలనే కుట్రలో కాంగ్రెస్ : Bandi Sanjay

హిందువులను మైనారిటీలుగా మార్చాలనే కుట్రలో కాంగ్రెస్ : Bandi Sanjay

National
న్యూఢిల్లీ : తెలంగాణలో హిందువులను మైనారిటీలుగా మార్చాలనే కుట్రతో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. బీసీల కోసం కాకుండా కేవలం ముస్లింలకు వంద శాతం రిజర్వేషన్లు కల్పించేందుకే ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా చేపట్టిందని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా హామీ ఇచ్చిన కాంగ్రెస్, అసలు ఆ డిక్లరేషన్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అందులో 10 శాతం రిజర్వేషన్లను ముస్లింలకు కట్టబెట్టాలన్న పథకంతోనే బీసీలను మోసం చేస్తున్నారన్నారు.‘‘ఇది అసలు బీసీ డిక్లరేషన్ కాదు. ముస్లిం డిక్లరేషన్ మాత్రమే’’ అని స్పష్టంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 27% రిజర్వేషన్లు అమలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రతిపాదన వల్ల బీసీలకు అదనంగా 5% మాత్రమే లభించబోతోంది. మతాధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, అంబేడ్కర్‌ భావనలతో కాంగ్రె...