Saturday, August 30Thank you for visiting

Tag: Bay of Bengal

AP Cyclone Alert | ముంచుకొస్తున్న ముప్పు.. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం

AP Cyclone Alert | ముంచుకొస్తున్న ముప్పు.. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం

Andhrapradesh
AP Cyclone Alert | ఏపీకి మళ్లీ వర్షాల ముప్పు ముంచుకొస్తోంది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చి మ వాయువ్య దిశగా పయనిస్తూ బ‌ల‌ప‌డి తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడుకు తూర్పు–ఆగ్నేయంగా 490 కిలోమీట‌ర్లు, పుదుచ్చేరికి తూర్పు–ఆగ్నేయంగా 500 కిలోమీట‌ర్లు నెల్లూరుకు ఆగ్నేయంగా 590 కి.మీ.దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది ఈ నెల 17న తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పశ్చిమ–వాయువ్య దిశగా ప‌య‌నించి ఉత్తర తమిళనాడు–దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరాలను పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశముంద‌ని వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. దీని కార‌ణంగా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో రానున్న మూడు రోజులు ఈ మూడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ...
Weather Report | తెలంగాణలో మరో మూడురోజులు ముసురు..

Weather Report | తెలంగాణలో మరో మూడురోజులు ముసురు..

Telangana
Rains | ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాలు మ‌రో మూడు రోజులు కొన‌సాగ‌నున్నాయి. ఈమేర‌కు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 5 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం (IMD Weather Report ) వెల్ల‌డించింది. రుతు పవన ద్రోణి జైసల్మేర్‌, రైసేన్‌, చింద్వారా, తూర్పు విదర్భ ప్రాంతంలోనున్న వాయుగుండం కేంద్రం గుండా తెలంగాణ, మచిలీపట్నం మీదుగా వెళ్తుందని.. ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉందని వివ‌రించింది.దీని ప్ర‌భావంతో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. మంగళవారం ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, జ‌య‌శంక‌ర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్ల‌గొండ, సూర్యాపేట, మహబాద్‌, హన్మకొండ, వరంగల్‌, జనగామ‌, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్...