
Ahmedabad bulldozer action : గుజరాత్ చరిత్రలోనే అతిపెద్ద బుల్డోజర్ చర్య!
అహ్మదాబాద్‌లో అక్రమ నివాసాల కూల్చివేతAhmedabad bulldozer action : గుజరాత్ చరిత్రలోనే అతిపెద్ద బుల్డోజర్ చర్యను చేపట్టింది అక్కడి బిజెపి ప్రభుత్వం. అహ్మదాబాద్ లో అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC) అధికారులు మంగళవారం భారీ డ్రైవ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా చందోలా సరస్సు సమీపంలోని అక్రమ స్థావరాలను AMC కూల్చివేసింది. దీని గురించి జాయింట్ పోలీస్ కమిషనర్ (క్రైమ్) శరద్ సింఘాల్ మాట్లాడుతూ, డోలా సరస్సు ప్రాంతంలో ఎక్కువ మంది బంగ్లాదేశీయులు (Bangladeshi immigrants) అక్రమంగా నివసిస్తున్నారని అన్నారు.చందోలా ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్న 100 మందికి పైగా బంగ్లాదేశీయులను అహ్మదాబాద్ పోలీసులు ఇటీవల గుర్తించారు. మంగళవారం, AMC అదే బంగ్లాదేశ్ స్థావరాలలో ప్రజలు అక్రమంగా నివసిస్తున్న ఆక్రమణ నిరోధక చర్య (bulldozer action) చేపట్టింది. ఈ చర్య కింద, AMC అధికారులు చందోలా ...