బంగ్లాదేశ్‌లో ఆగని రక్తపాతం: మరో హిందువు దారుణ హత్య! – Mymensingh attack
మయమన్‌సింగ్ జిల్లాలో సెక్యూరిటీ గార్డు కాల్చివేత.. పొంచి ఉన్న ముప్పువరుస హత్యలతో వణికిపోతున్న మైనారిటీలు.దీపూ చంద్ర దాస్, అమృత్ మండల్ తర్వాత తాజాగా బజేంద్ర బిశ్వాస్ బలి.ప్రమాదవశాత్తు జరిగిందంటున్న నిందితుడు.. దర్యాప్తులో పోలీసులు.Mymensingh attack : బంగ్లాదేశ్‌లో హిందువులే లక్ష్యంగా జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. అల్లర్లు, ఘర్షణలతో అట్టుడుకుతున్న దేశంలో మైనారిటీల భద్రత గాలిలో దీపంలా మారింది. దీపూ చంద్ర దాస్, అమృత్ మండల్ అనే హిందూ యువకుల హత్యోదంతాలు మరవకముందే.. తాజాగా బజేంద్ర బిశ్వాస్ (42) అనే మరో హిందువు ప్రాణాలు కోల్పోయాడు.ఏం జరిగింది?మయమన్‌సింగ్ జిల్లాలోని ఒక ప్రైవేట్ కర్మాగారంలో బజేంద్ర బిశ్వాస్ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. సోమవారం సాయంత్రం సుమారు 6.45 గంటల సమయంలో, అతడి సహోద్యోగి నోమన్ మియా జరిపిన కాల్పుల్లో బిశ్వాస్ అక్కడికక్కడే...

