Baba Siddique Murder Case : ఒక్క హత్యతో దేశాన్ని గడగడలాడించిన నేరగాళ్లు, నిందితుల కుటుంబసభ్యులు ఏం చెప్పారు?
Baba Siddique Murder Case : 1990లలో జరిగిన రాజకీయ ప్రేరేపిత హత్యలు మళ్లీ కలకలం సృష్టించాయి. దశాబ్దాల తర్వాత ముంబైలో జరిగిన బాబా సిద్ధిక్ హత్య యావత్ దేశాన్ని కుదిపేసింది. బాబా సిద్ధిఖీపై 19 నుంచి 23 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు షూటర్లు కాల్పులు జరిపారు. సిద్ధిఖీ NCP అజిత్ పవార్ వర్గానికి చెందిన నాయకుడు. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. దాదాపు 48 ఏళ్లు కాంగ్రెస్‌లో ఉన్న సిద్ధిఖీ కొంతకాలం క్రితం ఎన్సీపీలో చేరారు. అయితే, మాజీ మంత్రి హత్యకు సంబంధమున్న నిందితుల కుటుంబాలు షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు.ఈ హత్య కేసులో నిందితులు ముగ్గురూ సాధారణ కుటుంబాలకు చెందినవారే. ఇద్దరు నిందితులు శివకుమార్ అలియాస్ శివగౌతమ్. ధరమ్‌రాజ్ కశ్యప్ ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లా వాసులు కాగా, గుర్మైల్ బల్జీత్ సింగ్ అనే వ్యక్తి హర్యానాలోని కైతాల్ జిల్లా వాసి. ఈ ముగ్గురు యువకులు బాబా సిద్ధ...