మీకు రేషన్ కార్డు ఉందా? అయితే మీరు ఇంట్లోనే ఆయుష్మాన్ కార్డును ఇలా పొందండి
Ayushman Bharat Yojana | భారతదేశంలో నిరుపేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఉచిత వైద్యసేవలు అందిస్తోంది. దీని కోసం ప్రభుత్వం 2018 సంవత్సరంలో ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుంది. పథకం కింద ప్రయోజనాలను పొందడానికి, ఆయుష్మాన్ కార్డును తీసుకోవాల్సి ఉంటుంది.ఇంతకు ముందు ఆయుష్మాన్ కార్డు పొందే ప్రక్రియ కాస్త కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు అది చాలా సులభంగా మారింది. మీరు ఇంట్లో కూర్చొని ఆయుష్మాన్ కార్డును పొందవచ్చు, అయితే దీని కోసం మీ రేషన్ కార్డులో మీ పేరు ఉండాలి. రేషన్ కార్డులో మీ పేరు ఉంటే ఇంట్లో కూర్చొని ఆయుష్మాన్ కార్డును తయారు చేసుకోవచ్చు.
ప్రక్రియ ఇదీ..మీరు ఆయుష్మాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీని తర్వాత మీరు లాగిన్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత వెరిఫైపై క్లిక్ చేయ...