ఈ ఏడాది మార్చి వరకు రామ మందిరం కోసం రూ. 900 కోట్లు ఖర్చు: అయోధ్య ట్రస్ట్
Ayodhya: శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఫిబ్రవరి 5, 2020 నుంచి ఈ సంవత్సరం మార్చి 31 వరకు అయోధ్యలో రామ మందిర (Ayodhya Ram Temple) నిర్మాణానికి రూ.900 కోట్లు ఖర్చు చేసిందని, ఇంకా రూ.3,000 కోట్ల బ్యాంకు ఖాతాల్లో ఉందని ట్రస్ట్ అధికారులు శనివారం తెలిపారు.
శనివారం మూడు గంటలపాటు ట్రస్ట్ అధికారుల సమావేశం జరిగింది. అనంతరం, విదేశీ కరెన్సీలో విరాళాలు తీసుకునే చట్టపరమైన ప్రక్రియతో సహా 18 అంశాలపై చర్చించామని, ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) చట్టం కింద అనుమతి కోసం ట్రస్ట్ దరఖాస్తు చేసిందని ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.
"ఫిబ్రవరి 5, 2020 నుంచి మార్చి 31, 2023 వరకు ఆలయ నిర్మాణానికి రూ. 900 కోట్లు ఖర్చు చేశామని, ఇంకా రూ.3,000 కోట్లకు పైగా ట్రస్ట్ బ్యాంక్ ఖాతాల్లోనే మిగిలి ఉంది" అని చంపత్ రాయ్ చెప్పారు. జనవరి 2025 నాటికి ఆలయం మూడు దశల్లో పూర్తవుతుందని తెలపిారు. .సరయూ నది ఒడ్డున ...