అయోధ్య లో సొంతిల్లు కావాలనుకునేవారికి సువర్ణావకావం.. రామాలయానికి దగ్గరలోనే ‘వశిష్ఠ్ కుంజ్ టౌన్‌షిప్
Ayodhya Vashishth Kunj Township | ఉత్తరప్రదేశ్‌లోని రామనగరి అయోధ్యలో సొంత ఇల్లు కావాలనుకునే వారికి సువర్ణావకాశం.. రామమందిరానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో 'వశిష్ఠ్ కుంజ్ టౌన్‌షిప్' (Vashishth Kunj Township ) నిర్మించాలని అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ నిర్ణయించింది. సెప్టెంబరు 10వ తేదీ మంగళవారం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామ ఆలయానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో 'వశిష్ఠ కుంజ్ రెసిడెన్షియల్ స్కీమ్' కింద టౌన్‌షిప్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.“శ్రీరాముడి నగరంలో స్థిరపడాలని భావిస్తున్న ప్రజలకు శుభవార్త.. శ్రీరామ ఆలయానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో 'వశిష్ఠ్ కుంజ్ రెసిడెన్షియల్ స్కీమ్' కింద టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేస్తారు. 75 ఎకరాల స్థలంలో ఈ గృహనిర్మాణ పథకాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో దాదాపు 10 వేల మందికి రెసిడెన్షియల్ ప్లాట్లు కేటాయిస్తారు’’ అని ప్రభుత్వం ఎక్స్ పోస్ట్‌లో పేర...