
Weekly Horoscope : 12 రాశుల వారికి గ్రహ ఫలాలు..
Horoscope : అక్టోబర్ 22 నుంచి 28వ తేదీ వరకు మేష రాశి మొదలు.. మీన రాశి వరకు 12 రాశులవారికి ఆదివారం నుంచి గ్రహ ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేష రాశి
ఈ వారంలో నివాసంలో మార్పులు చేర్పులు చేయవలసి వస్తుంది. వ్యాపార నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత కన్ ఫ్యూజన్ కు గురవుతారు. సేవా కార్యక్రమాలలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. సంకల్పించిన పనుల యందు నిరుత్సాహం ఎదురవుతుంది, ఆత్మీ యుల ఎడబాటు మీ మానసిక ఆందోళనకు కారణమవుతాయి. బంధుమిత్రులతో వైరం అంత మంచిది కాదు. అనవసరమైన విషయాల పట్ల విపరీతమైన భయాందోళన కలుగుతాయి. వృత్తి వ్యాపారపరమైన అభివృద్ధి కోసం వేసే అడుగులు మనోధైర్యంతో తీసుకోవాలి. విద్యా ర్థులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు, చేతికి అందకుండా ఆలస్యమై ఇబ్బంది పెడుతున్న ధనం చేతికి అందుతుంది. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
వృషభ రాశి
ఈ వారంలో వృత్తి యందు ఇబ్బందులు కలిగే అవకాశాలు కలవు. ఇతరుల వి...