Assembly elections | రేపే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు.. ఓటింగ్‌కు రంగం సిద్ధం, వివరాలు
Maharashtra Jharkhand Assembly elections : మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం (ECI) అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అలాగే, ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళ, ఉత్తరాఖండ్‌లలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు కూడా ఎన్నికల సంఘం సన్నాహాలను పూర్తి చేసింది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.మహారాష్ట్రలో MVA vs మహాయుతిMaharashtra Assembly elections : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి, అధికార బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి పోటీ పడుతోంది, మరోవైపు మహా వికాస్ అఘాడి (Maha Vikas Aghadi MVA) కూటమి అధికారం కోసం ఉవ్విళ్లూరుతోంది.
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమ...