KCR | ఇది ప్రభుత్వం చేయాల్సిన పనేనా? కాంగ్రెస్‌పై కేసీఆర్ ఫైర్ ..
KCR | కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయడంపై మాజీ సీఎం, బిఆర్ ఎస్ అధినేత కల్వకుంట్లచంద్రశేఖర్ రావు ఫైర్ అయ్యారు. ఇది ప్రభుత్వం చేయాల్సిన పనులు ఇవేనా అని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ మూర్ఖత్వమని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆదివారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై కేసీఆర్ (KCR) తీవ్ర అభ్యంత్రం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం ముందుగా ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల...