Tirupati laddoo row : తిరుమలకు ఆవు నెయ్యి సరఫరా చేసిన కంపెనీ టీటీడీ ఫిర్యాదు
Tirupati laddoo row | తిరుపతి లడ్డూలలో కల్తీపై దుమారం రేపుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) దిండిగల్‌కు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్ (AR Dairy Foods) పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆలయానికి కల్తీ నెయ్యి ట్యాంకర్లను సరఫరా చేసిన సదరు కంపెనీ క్రిమినల్ కేసులు పెట్టాలని టీటీడీ పోలీసులను అభ్యర్థించింది.
తిరుపతి లడ్డూ (Tirumala laddu)ల నాణ్యతపై పలువురు భక్తులు ఫిర్యాదు చేశారని, ఆవు నెయ్యి కొనుగోళ్లలో అనేక సమస్యలు ఉన్నాయని టీటీడీ దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. భక్తులకు అందించే ప్రసిద్ధ తిరుపతి ప్రసాదం తయారీలో బీఫ్ టాలో, చేప నూనె, పంది కొవ్వుతో కూడిన కల్తీ నెయ్యిని ఉపయోగించినట్లు నివేదికలు సూచించడంతో లడ్డూలపై వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
ప్రసాదం నుంచి ఎప్పుడూ లేని వాసన వస్తోందని భక్తులు ఫిర్యాదు చేయడంతో లడ్డూల్లో కల్తీ జరిగిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ స...