
Pawan Kalyan : అనుమంచిపల్లిలో పవన్ కళ్యాణ్ అరెస్ట్ !
Pawan Kalyan : విజయవాడ-హైదరాబాద్ రహదారిపై హైటెన్షన్ నెలకొంది. అనుమంచిపల్లిలో జనసేనాని పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ను.. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ని అడ్డుకునేం దుకు జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో ఆగ్రహించిన జనసైనికులు వాటిని తొలగించారు. దీంతో వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనతో విజయవాడ-హైదరాబాద్ పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.ఇదిలా ఉంటే.. అనుమంచిపల్లి సమీపంలో మరోసారి పవన్ కళ్యాణ్ వాహనాన్ని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తోపాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనంలో తీసుకు వెళ్తున్నారు. అయితే వారిని...