
Tirupati laddu : ఆంధ్రప్రదేశ్ తిరుపతి లడ్డూ కేసులో నలుగురు అరెస్టు
Amaravati : దేశవ్యాప్తంగా దుమారం రేపిన వెంకటేశ్వర స్వామి ఆలయ లడ్డూ (Tirupati laddu Issue ) వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భక్తులకు ప్రసాదంగా అందించే ప్రసిద్ధ తిరుపతి లడ్డూలను కల్తీ చేశారనే ఆరోపణలతో సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం నలుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిని విపిన్ జైన్, పొమిల్ జైన్, అపూర్వ చావ్డా, రాజు రాజశేఖరన్‌లుగా గుర్తించినట్లు వారు తెలిపారు. సిట్ దర్యాప్తులో నెయ్యి సరఫరాలో ప్రతి దశలోనూ నిబంధనలను పూర్తిగా అతిక్రమించినట్లు వెల్లడైందని, దీంతో నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.వైష్ణవి డెయిరీ అధికారులు ఆలయానికి నెయ్యి సరఫరా చేయడానికి ఏఆర్ డెయిరీ పేరుతో టెండర్లను పొందారని, టెండర్ ప్రక్రియను తారుమారు చేయడానికి నకిలీ రికార్డులను సృష్టించారని తెలిపారు.వైష్ణవి డెయిరీ భోలే బాబా డెయిరీ నుంచి నెయ్యిని సేకరించినట్లు తప్పుగా చెప్పిందని సిట్ బయటపెట...