మనిషి మెదడును తినే అత్యంత ప్రమాదకరమైన సూక్ష్మజీవి ఇది..
కేరళా బాలుడిని బలిగొన్న అరుదైన వ్యాధి
Kerala : కేరళాలో మరో అరుదైన సూక్ష్మజీవి కలకం రేపింది. 'Brain-Eating Amoeba' గా పిలవబడే నేగ్లేరియా ఫౌలెరీ అనే ప్రొటోజొవన్ సూక్ష్మజీవి శరీరంలోకి ప్రవేశించడంతో పదో తరగతి విద్యార్థి కేరళలోని అలప్పుజా (Alappuzha) జిల్లాలో ప్రాణాలు కోల్పోయాడు. గత ఆదివారం నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు అతని బంధువులు మీడియాకు తెలిపారు.ఆలప్పుజాలోని పూచక్కల్‌కు చెందిన షాలిని, అనిల్‌కుమార్‌ల కుమారుడు బాధితుడు గురుదత్ (15) స్థానిక వాగు వద్ద ఈతకు వెళ్లాడు. అదే సమయంలో మెదడును తినే అమీబా అతడి శరీరంలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నారు.ఇది సాధారణంగా వెచ్చని మంచినీరు (సరస్సులు, నదులు, వేడి నీటి బుగ్గలు వంటివి)తోపాటు మట్టిలో కనిపిస్తుంది.అనే అమీబా.. ఏకకణ జీవి. ఇది సాధారణంగా వెచ్చని మంచినీరు (సరస్సులు, నదులు, వేడి నీటి బుగ్గలు వంటివి)తో...