Amit Shah | జమ్మూలో కాశ్మీర్ లో ‘జీరో టెర్రర్ ప్లాన్’ తో హోంమంత్రి అమిత్ షా..
Jammu Kashmir zero terror plan | జమ్మూకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడుల తర్వాత శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆరు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ మారథాన్ సమావేశంలో కాశ్మీర్ లోయలో గతంలో అమలు చేసిన విజయవంతమైన 'ఏరియా డామినేషన్ ప్లాన్' 'జీరో టెర్రర్ ప్లాన్'లను జమ్మూ డివిజన్‌లో పునరావృతం చేయాలని హోం మంత్రి భద్రతా ఏజెన్సీలను ఆదేశించారు.జమ్మూ కాశ్మీర్‌లో ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితులపై హోంమంత్రికి సమగ్ర వివరణ ఇచ్చారు. మిషన్ మోడ్‌లో పని చేయాలని, సమన్వయంతో పనిచేసి త్వరితగతిన ప్రతిస్పందించాలని అమిత్ షా అన్ని భద్రతా ఏజెన్సీలను ఆదేశించారు. ఉగ్రవాదం అత్యంత వ్యవస్థీకృత తీవ్రవాద హింసాత్మక చర్యల నుంచి కేవలం ప్రాక్సీ వార్‌గా పరమితమైనట్లు ఇటీవలి సంఘటనలను బట్టి తెలుస్తోందని అన్నారు.భద్రతా బలగాలు రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో...