Air Taxi service | ఢిల్లీ నగరవ్యాప్తంగా ఎయిర్ టాక్సీ సేవలు, మొత్తం ఆరు రూట్లు, 48 హెలిపోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్..
Air Taxi service : ఎయిర్ టాక్సీలతో ఇంటర్‌సిటీ డొమెస్టిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), డిజిటల్ స్కైతో ఢిల్లీ NCRలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ తో ఎయిర్ టాక్సీని ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.ఒకవేళ ఈ ఎయిర్ టాక్సీ అందుబాటులోకి వస్తే దేశంలో ప్రజా రవాణాగా సౌకర్యాన్ని కలిగి ఉన్న మొట్టమొదటి నగరంగా ఢిల్లీ ఎన్‌సిఆర్ నిలవనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే పూర్తికాగా మొదట 6 రూట్లను ఖరారు చేశారు. ఈ ప్రాజెక్టును సాకారం చేసేందుకు అధికారులు ఎన్‌సీఆర్‌లో 48 హెలిప్యాడ్‌లను నిర్మించనున్నారు.
6 రూట్లు, 48 హెలిపోర్టులు
ఢిల్లీ ప్రాంతంలో పూర్తిగా సర్వే చేసిన తర్వాత మొత్తం 6 రూట్ల...